నేటి సాక్షి న్యూస్ జూలై 06
కోసిగి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని, ఎస్.కొటాల ప్రభుత్వ పాఠశాలకు నూతన తరగతి గదుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్.కొటాల గ్రామంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేష్, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. అప్పటి నుంచి పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వేసవి సెలవుల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. తరగతి గదులు లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతున్నారని, తాత్కాలికంగా చర్చిలో బోధన కొనసాగిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి పాఠశాల గదుల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి హనుమంతు, ప్రవీణ్, జీవన్, విద్యార్థులు సాత్విక్‌తో పాటు పలువురు విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.
Andhra
హెడ్లైన్ : పాఠశాల గదుల నిర్మాణంలో జాప్యం.. ఏఐఎస్ఎఫ్ ఆందోళన
Quick Summary:
పాఠశాల గదుల నిర్మాణంలో
