నేటి సాక్షి,కాళపూర్.
(సురేష్ మోత్కూర్ )
కాలాపూర్ గ్రామంలో రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ యొక్క పంట పొలాలను ఇండస్ట్రీస్ కోసం లాక్కోవడం సరికాదని మా జీవితాలను పణంగా పెట్టి అయినా పొలాలను కాపాడుకుంటామని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బి ఆర్ ఎస్ నాయకులు రైతులకు మద్దతు తెలుపుతున్నారు.పంట పండించే భూములలో ఇండస్ట్రియల్ కారిడార్ వద్దంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాలాపూర్ రైతులకు మద్దతు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని చెప్తుంటారు కానీ రైతులకు నష్టాలు కలిగిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజా పాలన ఎక్కడ ఉంది?అని ఎద్దేవ చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నష్టం కలిగించే విధంగా భూములు లాక్కుంటుందని, రైతులు రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు వదిలే పరిస్థితి కి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, కౌన్సిలర్ జాక్ రవికుమార్, మిట్ట కోడూరు సర్పంచ్ మాణిక్యం, మాజీ ఏఎంసి డైరెక్టర్ సేవియా నాయక్.
Telangana
*రైతుల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం ?-ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు.*
Quick Summary:
రైతుల ప్రాణాలతో చాలగటం...