నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈగల్ ఫోర్స్ టీం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
*ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్ మాట్లాడుతూ*
యువత దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు, పర్యవేక్షణతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినా, ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంలో పాల్గొంటున్నట్లు గమనించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908, డయల్-100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం. జి. కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ చి. సునీల్ కుమార్, ఏఓ వేణుకొండల్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సీసీఎస్ ఎస్‌ఐ రాజు, సుప్రియా ఆసుపత్రి సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్* ------------------------------------------
Quick Summary:
మాతా శిశు ఆసుపత్రి ఆవరణం లో మొక్కలు నాటిన అదనపు ఎ స్పీ శ్రీ చేతన్ నితిన్ ఐ పీ ఎస్...