నేటి సాక్షి న్యూస్ జూలై 11
కౌతాళంలో అక్రమ ఆక్రమణలపై వార్తలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వి. ప్రకాష్ రెడ్డిని ఫోన్‌లో దూషించి, బెదిరించిన ఘటనను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు భీమన్న తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా భీమన్న మాట్లాడుతూ ప్రజా సమస్యలు, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులను బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో ఇలాంటి బెదిరింపులు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Andhra
హెడ్లైన్ : జర్నలిస్టును బెదిరించిన ఘటనను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
Quick Summary:
కౌతాళంలో అక్రమ ఆక్రమణలపై వార్తలు