నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.............................................
జగిత్యాల జిల్లా ఎస్ పి అశోక్ కుమార్, IPS ఆదేశాల మేరకు,
అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ P. చేతన్ నితిన్, మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ K.పురుషోత్తం రెడ్డి సూచనల మేరకు ఈరోజు జగిత్యాల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యార్థులను రవాణా చేసే ఆటో రిక్షా మరియు టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఆటో మరియు టాటా మ్యాజిక్ డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.కరుణాకర్ ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలు మరియు పాఠశాల విద్యార్థుల సురక్షిత రవాణాపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాల్లో అనుమతించిన సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, పిల్లలను ఫుట్‌బోర్డు, వాహనం తలుపు వద్ద లేదా వాహనం వెలుపల కూర్చోనివ్వరాదని, పిల్లలు సురక్షితంగా కూర్చున్న తర్వాతే వాహనాన్ని నడపాలని సూచించారు.అదేవిధంగా నిర్ణీత వేగ పరిమితులను పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, విద్యార్థులను సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే ఎక్కించడం మరియు దించడం, వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు, ఇండికేటర్లు, హారన్ తదితరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్ వంటి అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ సంకేతాలు మరియు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో, పాఠశాలల పరిసరాల్లో మరియు రద్దీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచిస్తూ, పాఠశాల విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రతి డ్రైవర్ యొక్క తొలి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ SI బి.మల్లేష్ , ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఆటో రిక్షా మరియు టాటా మ్యాజిక్ డ్రైవర్లు పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల పట్టణంలో ఆటో రిక్షా మరియు టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం* -------------------------------------------
Quick Summary:
ఆటో రిక్షా మరియు టాటా
