Telangana
చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్య చట్టం తీసుకురావాలి -బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు పిలుపు
Quick Summary:
బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు పిలుపు
నేటిసాక్షి, మిర్యాలగూడ : చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిద్య చట్టం వచ్చేవరకు పోరాటం చేయాలని, బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అస్తిత్వ ఉద్యమాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కావాలని స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు వివిధ రూపాల్లో తీవ్రమైన ఆందోళన జరిపిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపితే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాల్సిన బిల్లుకు ఇంతవరకు అతిగతి లేదని, ఇప్పుడు బీసీలు చేసే పోరాటం జీవనోపాధికి సంబంధించినది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాలు చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్య చట్టం తీసుకురావాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.