.
నేటి సాక్షి వికారాబాద్ :
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప విద్యావేత్త, జాతీయవాది అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా వికారాబాద్ పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ "డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి" మాట్లాడుతూ, దేశ సమైక్యత, అఖండత కోసం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భారతీయ జనసంఘ్‌ను స్థాపించి జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాది వేసిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.
దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం, దేశభక్తి, సేవా తత్వం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారతదేశం బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న ఆయన కలలను సాకారం చేయడమే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు సదానంద్ రెడ్డి, వికారాబాద్ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, మల్ రెడ్డి, యాదవ రెడ్డి, మల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి సేవలను స్మరించుకున్నారు.
Telangana
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి త్యాగాల పునాదులపై నవభారత నిర్మాణం. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ "డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి"
Quick Summary:
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి త్యాగాల పునాదులపై