నేటిసాక్షీ మంచిర్యాల(శ్రీధర్ దమ్మ)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
కొంతకాలంగా శాంతి ఖని ప్రాజెక్ట్ లో కాఫర్ వైర్ దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. అంతు చిక్కని విధంగా దొంగతనాలు పరంపర సాగుతున్నది. ఎట్టకేలకు కాపర్ వైర్ దొంగతనం కేసును బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు చేధించారు. కాఫర్ వైర్ దొంగలను అనూహ్యంగా పట్టుకున్నారు.
సంఘటన వివరాలను బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం శాంతి ఖని మైన్ లో కాపర్ వైర్ దొంగతనం చోటుచేసుకున్నది. అధికారులను నుంచి కంప్లైంట్ రాగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సీహెచ్ కిరణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి శాంతి ఖని ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడ కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. సదరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని విచారించారు. వారి దగ్గర 10 కిలోల కాపర్ వైర్ దొరికింది.
ఈ సంఘటనలో ఏడుగురునీ అరెస్టు చేశారు. మందమర్రి విద్యానగర్ కు చెందిన A1) పాస్తం గోపాల్ ,A2) కళమంచి అశోక్ A3) కళ్ళమంచి కళ్యాణ్, A4) పాస్తం వీర స్వామి, A5) పార్థన్ గణేశ్, A6) రాజ సమ్మయ్య, A7) పాస్తం సారయ్య కాపర్ వైర్ ను తీసుకువెళ్లేందుకు వచ్చి పట్టుబడ్డారు. శాంతి ఖని మైన్ లో దొంగతనo చేసిన కాఫర్ వైర్ ను అక్కడే చెట్ల పొదల్లో దాచి పెట్టారు. దాచిపెట్టిన కాఫర్ వైర్ ను తీసుకు వెళ్దామని వచ్చిన దొంగలను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరెస్టు అయిన దొంగలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్ చేశారు. నిందితులు శాంతిఖని దొంగతనల్తో పాటూ రామకృష్ణాపుర్ పరిధిలో 2 నేరాలలోకూడా బాగస్వాములనీ వెల్లడించారు. నేరస్తులను పట్టుకున్న బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ ch కిరణ్ కుమార్, CCS ఎస్ ఐ శిరీష వారి సిబ్బంది , HC హేమ సుందర్, PC శ్రీనివాస్, బెల్లంపల్లి ఐడి పార్టీ HC రాజేశ్వర్, PC రాము టూ టౌన్ సిబ్బందినీ సీఐ హనోక్ అభినందించారు.
Telangana
10కిలోల కాఫర్ వైర్ స్వాధీనం
Quick Summary:
10 కిలోల కాఫర్ వైర్ స్వాదినం....