నేటి సాక్షి కూకట్పల్లి జూలై 27( ప్రసాద్ ) :శంషిగూడ డివిజన్ పరిధిలోని శంషిగూడ లో జరుగుతున్న సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరివేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు, బూతు లెవెల్ అధికారులు సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను గుర్తించి తొలగించేందుకు బిఎల్ఓలు కృషి చేయాలని, నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గోపాల్, పోశెట్టిగౌడ్, సుధాకర్, అంజలి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
శంషిగూడ డివిజన్ పరిధిలోని శంషిగూడ లో జరుగుతున్న సర్
Quick Summary:
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా