నేటి సాక్షి,దోమ, బొంపల్లి
(సురేష్ మోత్కూర్ )
ఎస్ ఐ ఆర్ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బొంపల్లి మాజీ ఎంపిటిసి రాఘవపురం రాములు తెలిపారు. శనివారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో బి ఎల్ వో తో కలిసి ఇంటింటికి ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలు అధికారులు చేపడుతున్న సవరణలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామస్థాయిలో డెత్ డబుల్ ఓట్లు చాలా ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి,యువకులకు నూతన ఓటరును నమోదు చేయించేందుకు శ్రద్ధ చూపాలన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా చేపట్టి అందుబాటులో ఉంచాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చూపిన ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసినందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా అవగాహన లేని ప్రజలకు దరఖాస్తు ఫారాలను అధికారులు నింపి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి - బొంపల్లి మాజీ ఎంపిటిసి రాఘవాపురం రాములు
Quick Summary:
బొంపల్లి మాజీ ఎంపిటిసి రాఘవాపురం రాములు