నేటి సాక్షి,దోమ
(సురేష్ మోత్కూర్ )
జిల్లాలో వర్షాలు కురువక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సాగు చేసిన పంటలు ఎండల తీవ్రతతో ఎండిపోతుండడంతో కన్నీటిపర్యాంతమవుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే వరుణదేవుడు కరుణించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాలలో మహిళలు కప్పకావడి చేపట్టడంతో పాటు సమీప దేవాలయాల్లో దేవుళ్లకు నీళ్లు, వరద పాశం చేస్తూ వర్షాలు కురువాలని ఆయా గ్రామాల గ్రామస్తులు, భజన మండలి సభ్యులు వేడుకుంటున్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని పాలేపల్లి శ్రీ వీరాంజనేయ భజన మండలి, గ్రామస్తులందరూ కలసి దిర్సంపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి వర్షాలు కురువాలని వరదపాశం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల కన్నీళ్లను తూడిచే విధంగా భగవంతుడిని వేడుకున్నారు. అనంతరం ఆంజనేయ స్వామికి ప్రసాదం అందించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భజన మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
వర్షాలు కురువాలని ఆంజనేయస్వామికి వరదపాశం
Quick Summary:
జిల్లాలో వర్షాలు కురువక రైతులు