నేటి సాక్షి 27 జూన్ పాములపాడు:-
పాములపాడు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు లేవు ఉరుములు లేవు, మరియు ఈదురు గాలులు లేవు కానీ పాములపాడు గ్రామంలో మాత్రం కరెంట్ పోయింది అంటే చాలు ఆరోజు. రాత్రి అంతా తీసివేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండవలసిన శాఖలలో ఏదైనా ఉంది అంటే అది ఒకటి విద్యుత్ శాఖ. రాయలసీమ అధ్యక్షుడు మాల మహానాడు కలబండి.అంకన్న మాట్లాడుతూ..అయితే ఇక్కడ పాములపాడు మండలంలోని అన్ని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా రాత్రి అంతా చిమ్మ చీకటితో, ఉన్నపుడు ఊర్లోకి కొత్త వ్యక్తులు రావడం కానీ దొంగలు పడటం కానీ మరియు చిన్న పిల్లలు, పెద్దలు దోమల భారిన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా దోమల వలన ఒక గంట సేపు కాదు రాత్రి అంతా కూడా అంధకారం లో చిమ్మ చీకటి లో పాములపాడు గ్రామంలో ఉన్నప్పుడు దోమల వలన వృద్ధులకు , చిన్నపిల్లకు , పెద్దలకు ఏదైనా డెంగ్యూ, కానీ విష జ్వరాలు రావడం వలన మరియు వైరల్ ఫీవర్ ఇలాంటి వి వస్తె పేద ప్రజలు వేలకు వేలు డాక్టర్ల కు పెట్టుకోవాలి అంతే అందరూ ధనవంతులు కారు చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు. ప్రతి సారి ఇలా విద్యుత్ తీసివేయడం సమంజసం కాదు అని చెప్పడం జరిగింది.
పాములపాడు విద్యుత్ ఏఈ అధికారికి ఈ సమస్య గురించి చెప్పటం వలన ఎలాంటి ప్రయోజనo ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఎన్నోసార్లు కరెంట్ పోయింది అని అడుగగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేస్తాడు సమాధానం ఉండదు. ఎందుకు అంటే ఆయన రూటే సపరేటు అన్నట్లు వ్యవహరిస్తారు. ఇక్కడ ఈ సమస్య ఉంది అని చెప్పిన కూడా పట్టించుకొనే పాపాన పోలేదు. నిత్యం ప్రజలు అందుబాటులో ఉండవలసిన విద్యుత్ అధికారులు కానీ ఇక్కడ ఆ అధికారి మాత్రం ఆయన రూటే సపరేటు.. సెల్ ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడడు ఇలాంటి ఉన్నత అధికారులు మన పాములపాడు మండలానికి అధికారులు ఉన్నారు కాబట్టి ఇలాంటి వి పునరావృతం కాకుండా ఉండాలంటే పై ప్రభుత్వఉన్నత అధికారులు వీరి పై తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలకు ప్రాణాలతో చెలగాటం ఆదుకోవద్దని ఇలాంటిమళ్ళీ జరిగితే నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం వారికి ఈ సమస్య గురించి ఫిర్యాదు చేస్తామని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారని జాతీయ రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న హెచ్చరించారు..
Andhra
దొంగలకు తాళాలు అందిస్తున్న విద్యుత్ శాఖ.. * పాములపాడు గ్రామంలో వర్షాలు లేవు, ఉరుములు లేవు ఈదురు గాలులు లేవు * కానీ రాత్రి అంతా అంధకారంలో పాములపాడు గ్రామం :- రాయలసీమ అధ్యక్షుడు మాల మహానాడుకలబండి. అంకన్న. * దొంగలకు సాహసరిస్తున్న విద్యుత్ శాఖ రాత్రి అంతా కరెంట్ లేక చిన్న పిల్లలు, పెద్దలు , దోమల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విష జ్వరాలు వస్తాయి. ఈ సమస్య గురించి విద్యుత్ ఏ ఈ. నీ వివరణ అడుగగా సమాధానం లేక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు....
Quick Summary:
దొంగలకు తాళాలు అందిస్తున్న విద్యుత్ శాఖ..