*నేటిసాక్షి హైదరాబాద్*
మినిస్టర్ క్వార్టర్స్‌లో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూకట్‌పల్లి నియోజకవర్గం ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు కర్క నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్.యస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పొన్నం ప్రభాకర్ తో గతంలో విద్యార్ది నాయకుడిగా వారితో కలిసి పనిచేసిన రోజులను నెమరేసుకున్నారు.
కార్మిక నాయకుడిగా కార్మికలకు మరింత సేవ చేయాలని దివంగత నేత పి.జే.ఆర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కర్క నాగరాజు కు సూచించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించటం లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందువుంటుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు ఎర్ర కృష్ణ కుమార్, మొహ్సిన్ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కర్క నాగరాజు*
Quick Summary:
మినిస్టర్ క్వార్టర్స్‌లో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి