నేటిసాక్షి కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
జగద్గిరిగుట్ట 280 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు హైమవతి రెడ్డి ఆధ్వర్యంలో బిఎల్ఎ లు నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఎస్ ఐ ఆర్ -2026 ప్రక్రియపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడం, అవసరమైన సమాచారం అందించడం, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలకు సహాయం చేయడం కోసం ఈ మెగా హెల్ప్ డెస్క్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎస్ ఐ ఆర్ -2026 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అర్హులైన ఓటరికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బిఎల్ఎ సభ్యులు మహిళలు పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
Telangana
ఎస్.ఐ.ఆర్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కోలన్ హన్మంత్ రెడ్డి
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

