*నేటి సాక్షి - కోరుట్ల*
కోరుట్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఉన్న అయ్యప్పగుట్ట – ఎన్టీఆర్ కాలనీలో రోడ్డు మరమ్మత్తు పనులను భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ సోరుపాక రమాదేవి రమేష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి చేపట్టారు.
వార్డులోని దెబ్బతిన్న రహదారుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తు పనులను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. పనులు నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ రమాదేవి మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. స్థానికుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
_________
Telangana
*రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన బీజేపీ కౌన్సిలర్ రమాదేవి* --------
Quick Summary:
కోరుట్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో
