నేటి సాక్షి ధర్మపురి ➡️మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి
➡️అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్‌లో జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.
➡️ఈ సందర్భంగా "నశా ముక్త్ భారత్"పోస్టరను ఆవిష్కరించి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.
➡️మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
➡️ఈ కార్యక్రమంలోకోరుట్ల ఎంఎల్ఏ కల్వకుంట్ల సంజయ్ , జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ శ్రీ సత్య ప్రసాద్ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమ్మిండ్ల వాణి ,జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి
Quick Summary:
మాదక ద్రవ్యాల నిర్మూలనకు
