నేటిసాక్షి, నల్లగొండ :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తున్న నల్లగొండ జిల్లా, మండలం, దోమలపల్లి గ్రామానికి చెందిన
ప్రముఖ సామాజిక వేత్త గాదే.బుచ్చయ్య సీనియర్ సివిల్ ఇంజనీర్ కు
బహుజన సాహిత్య అకాడమీ(బిఎస్ఈ) అత్యున్నత గౌరవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం-2026 ను అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన
"బహుజన రచయితల 19వ పశ్చిమ భారత సదస్సు"లో
బిఎస్ఈ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ,
జాతీయ ప్రధాన కార్యదర్శి డా.యు. సుబ్రమణియన్,
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, మరియు తెలంగాణ రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. విద్య, సాహిత్యం, కళల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి,
అణగారిన వర్గాల హక్కుల కోసం గాదే.బుచ్చయ్య సీనియర్ సివిల్ ఇంజనీర్ చేసిన నిస్వార్థ సేవలను ,
గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాదే.బుచ్చయ్య సీనియర్ సివిల్ ఇంజనీర్ మాట్లాడుతూ,
"ఈ గౌరవం నా ఒక్కడిది కాదు. నా గ్రామం దోమలపల్లి, నల్గొండ ప్రజలందరి ఆశీస్సుల ఫలితం.
ఈ పురస్కారం మరింత బాధ్యతతో ప్రజా సేవ చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చింది" అని అన్నారు. తనకు ఈ గొప్ప అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana
"డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం అందుకున్న : గాదే బుచ్చయ్య" -నిత్యం 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతకు కృషి' చేస్తున్న బుచ్చయ్య
Quick Summary:
నిత్యం 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతకు