నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
..........................................
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 16- 6 -2026 రోజున ఫిర్యాదురాలు గండి లలిత భర్త: వంశీ, వయసు :22 సంవత్సరాలు, నివాసం: తాండ్రయల గ్రామం కథలాపూర్ మండలం జగిత్యాల జిల్లా అనునామే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదురాలు యొక్క కుమారుని ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల పట్టణంలో గల జంబిగద్దె సమీపంలోని మహదేవ హాస్పిటల్ కు వచ్చి వైద్యం చేయించుకుని హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బులు లేనందున ఆమె యొక్క మెడలో ఉన్న బంగారు పుస్తెలు మరియు గుండ్లు అమ్ముదామని అనుకుంటుండగా అట్టి విషయాన్ని విన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె యొక్క బంగారం అమ్మి డబ్బులు తీసుకొస్తామని నమ్మబలికి అట్టి బంగారం తీసుకొని పారిపోయినారు అని ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై ఎం. సుప్రియ గారు దర్యాప్తు చేపట్టగా ఈరోజు తేదీ 19- 6-2026 రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని సమాచారం రాగా జగిత్యాల పట్టణ ఎస్సై ఎం .సుప్రియ, కానిస్టేబుల్స్ జీవన్ మరియు చంద్రశేఖర్ లు వారిని పట్టుకుని ఇద్దరి పంచుల సమక్షంలో విచారించగా వారు 1)కత్తెరపాక దేవేందర్ తండ్రి : నరసయ్య ,49 సంవత్సరాలు , నివాసం: షాత్రాజ్ పల్లి గ్రామం, వేములవాడ మండలం, సిరిసిల్ల జిల్లా మరియు 2)నంద్యాల తిరుపతిరావు తండ్రి: భూపతిరావు, 48 సంవత్సరాలు, నివాసం: మల్లాపూర్ గ్రామం ,గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా అని తెలిపి వారు అట్టి బంగారు పుస్తెలు మరియు గుండ్లు వారిని మోసం చేసి తీసుకెళ్లినామని వాటిని అమ్ముకుందామని వెళ్తున్నామని తెలుపగా వెంటనే ఎస్ఐ గారు పంచల సమక్షంలో అట్టి దొంగల వద్ద నుండి బంగారం స్వాధీన పరుచుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనైనది అని జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ పి.కరుణాకర్ తెలియపరిచారు.
Telangana
*అవకాశమే ఆసరాగా, అదను చూసి నమ్మించి బంగారం తీసుకొని పారిపోగా* -------------------------------------------
Quick Summary:
*అవకాశమే ఆసరాగా, అదను చూసి నమ్మించి