నేటి సాక్షి వికారాబాద్ :
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు) పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన బ్యానర్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉప కేంద్రాలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే ఐ ఈ సి మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలియజేశారు.
అనంతరం రామాయగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన గర్భవతులు మరియు తల్లుల మీటింగ్ లో మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లి బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే నవజాత శిశువుకు మొదటి గంటలో వచ్చే ముర్రుపాలను తప్పక త్రాగించాలని ఈ ముర్రు పాలు పిల్లల పాలిట అమృతంతో సమానం అని, పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే సంపూర్ణ ఆహారమని కచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఆరు నెలల వరకు తాగించాలని, ఆరు నెలల అనంతరం తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలని సూచించారు.
తల్లిపాలు ఇవ్వడం వలన పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, మెదడు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుందని, తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం పెరుగుతుందని సూచించారు.
ప్రతి ఒక్క తల్లి వారి బిడ్డలకు కచ్చితంగా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని తెలిపారు. మీటింగ్ కు హాజరైన తల్లులు గర్భవతులకు పళ్ళు మరియు బిస్కెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అమృత లక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, మురళి, మహేష్ కుమార్ వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్.
Quick Summary:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్.
