Telangana
'సర్' కార్యక్రమం వల్ల ఏ ఒక్క ఓటుకు అన్యాయం జరగదు -ఆర్డీఓ రమణారెడ్డి
Quick Summary:
రాష్ట్రంలో జరుగుతున్న సర్
నేటిసాక్షి, మిర్యాలగూడ : రాష్ట్రంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని ఈనెల 24 తో ముగిస్తుండగా దానిని వచ్చే నెల ఆగస్టు తేదీ 3 వరకు పెంచినట్లు మిర్యాలగూడ ఈ ఆర్వో మరియు ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. విజ్ఞాన వేదిక ప్రోగ్రాం గ్రంథాల ఉద్యమం ఆధ్వర్యంలో, స్థానిక మిర్యాలగూడలోని గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా గ్రంథాలయ విద్యార్థులు సరిపోయిన అవగాహన పెంచుకొని పదిమందికి తెలియచేయాలని అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 78 శాతం సర్ కార్యక్రమం పూర్తయిందని, సాధ్యమైనంతవరకు 85 నుంచి 90శాతం వరకు పెంచాలని అన్నారు. అనంతరం ప్రధాన వక్త రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ, అనేక రాష్ట్రాలలో సర్ కార్యక్రమంలో అనేక అవకతవకలు జరిగాయని, అధికారులు వివరాలు నమోదు చేయడంలో సరైన ప్రమాణాలు పాటించలేదని అన్నారు. అనంతరం మధ్యాహ్నం స్థానిక మిర్యాలగూడలోని మీనా మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పైన విద్యార్థిని లకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో సామజిక వేత్త డా. రాజు, మరో గ్రంధాలయ ఉద్యమం నాయకులు కస్తూరి ప్రభాకర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, కొండల్ రెడ్డి, గ్రంధాలయ అధికారి శ్యాంసుందర్, సుధాకర్,కాంగ్రెస్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, రేవూరి ప్రతాప్, కంచి శ్రీనివాస, ఉదయ, కిరణ్మయి, బి. రామయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.