నేటి సాక్షి వికారాబాద్ :
13న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు టి. రాoచందర్, ప్రధాన కార్యదర్శి ఎండి. షఫీ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి రాంచందర్, ఎండి షఫీ మాట్లాడుతూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఆర్టీసీ, మెట్రో రైలు ఉచిత పాసులు కల్పించాలని, రైల్వే పాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని డిమాండ్ చేస్తూ 13న జరిగే ధర్నా నిర్వహిస్తున్నామని జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 11:30 నిమిషాలకు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకట్ రామ్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు వెంకటయ్య, జిల్లా కోశాధికారి ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్, రమేష్, ఉదయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యర్యంలో.
Quick Summary:
టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యర్యంలో.