Telangana
ఇంటర్మీడియట్ ఫలితాల్లో..."శ్రీ అరోరా జయకేతనం" -రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు -విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్, యాజమాన్యం
Quick Summary:
ఇంటర్మిడియట్ ఫలితాలో......
నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంప్రూమెంట్ ఫలితాల్లో పట్టణంలోని "శ్రీ అరోరా జూనియర్ కళాశాల" విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ పోరెడ్డి దుర్గారెడ్డి మరియు యాజమాన్యం తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో పి.భవాని (465/470), హేర్మ బిందు (452/470), సీఈసీ విభాగంలో ఎస్.కె. సుమయా రూహి (457/500), ఐ.శివ సాయి (443/500), బైపిసి మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎస్.కె. సమ్రిన్ (410/440), కె.శ్రావ్య (396/440), మరియు వీరితోపాటు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 400 మార్కులకు పైగా 27 మంది విద్యార్థులకు, మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 900 మార్కులు పైగా 25 మంది విద్యార్థులకు వొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, అధ్యాపక బృందం విద్యార్థి, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

