నేటి సాక్షి న్యూస్ జూన్ 30
పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వికలాంగుడు కుదె మారెప్ప తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నెల 29వ తేదీన బ్యాంకు పనిమీద మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఓ పర్సు కనిపించింది. అనుమానం రావడంతో పర్సును తీసి పరిశీలించగా అందులో సుమారు రెండున్నర తులాల బంగారు నగలతో పాటు రూ.1,300 నగదు ఉన్నట్లు గుర్తించాడు.
విలువైన నగలు, నగదు ఉన్నప్పటికీ వాటిపై ఆశపడకుండా యజమానికి చేరేలా చేయాలనే ఉద్దేశంతో వెంటనే పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పర్సును పోలీసులకు అప్పగించాడు. పోలీసులు పర్సులోని వివరాల ఆధారంగా విచారణ చేపట్టి అది పెద్దకడబూరుకు చెందిన చాకలి మధుదిదని గుర్తించారు. అనంతరం బంగారు నగలు, నగదుతో కూడిన పర్సును యజమానికి అప్పగించారు.
పేద కుటుంబానికి చెందిన వికలాంగుడైన మారెప్ప ఇంత విలువైన ఆస్తి దొరికినా నిజాయితీగా వ్యవహరించడం స్థానికులను ఆకట్టుకుంది. ఆయన చేసిన మంచి పనిని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో నిజాయితీ ఇంకా సజీవంగానే ఉందని మారెప్ప నిరూపించాడని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనను పోలీస్ సిబ్బంది సన్మానించి అభినందనలు తెలిపారు.
Andhra
హెడ్లైన్ : నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వికలాంగుడు కుదె మారెప్ప
Quick Summary:
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా