నేటి సాక్షి ఆగస్టు 12
కర్నూలు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను వైసీపీకి చెందిన దళిత సంఘాలు వ్యతిరేకించాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బొగ్గుల నరసన్న మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపై అనేక దాడులు జరిగినా వాటిని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. ఇటీవల ఆలూరు నియోజకవర్గంలో దళిత కాలనీలో నివసిస్తున్న ప్రజలపై ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన సోదరుడు, కుమారుడు తదితరులు వందలాది మందితో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనతో దళిత కుటుంబాలు భయాందోళనలకు గురయ్యాయని పేర్కొన్నారు.
దళితులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలుకు రావడం దళితుల పట్ల ఆయనకు ఉన్న వైఖరిని స్పష్టం చేస్తోందని నరసన్న విమర్శించారు. దళితులపై దాడులు జరిగినప్పుడు స్పందించకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మద్దతుగా నిలవడం సమంజసం కాదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ విలువలను గౌరవించాలని నరసన్న సూచించారు. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలపై స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో పాటు, కర్నూలు పర్యటనకు వచ్చే ముందే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళిత సంఘాలు స్పందించాలి
దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం వైసీపీకి చెందిన దళిత సంఘాలు ఈ అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని నరసన్న కోరారు. దళితులపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలపై పార్టీకి అతీతంగా స్పందించి, బాధిత దళిత కుటుంబాలకు న్యాయం జరిగేలా నిలబడాలని సూచించారు. వైఎస్ జగన్ కర్నూలు పర్యటనను వైసీపీ దళిత సంఘాలు కూడా వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితుల హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని బొగ్గుల నరసన్న పేర్కొన్నారు.
Andhra
వైఎస్ జగన్ కర్నూలు పర్యటనను వైసీపీ దళిత సంఘాలు వ్యతిరేకించాలి _ కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న
Quick Summary:
కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న