నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 11( రిపోర్టర్ ఇమామ్ ),
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంలో కంసనపల్లి నూతన బ్రేకర్ను నారాయణపేట జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరుల సమావేశంలో ఎస్సీ నవీన్ కుమార్ డి రాజునాయకులు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ప్రతి గ్రామంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదాలను గుర్తించి వాటి ఫోటోలు వీడియోలను ముందుగానే జిల్లాస్థాయి అధికారులకు డివిజన్ స్థాయి అధికారులకు వాట్స్అప్ ద్వారా అందించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రమాదాలను గుర్తించి విద్యుత్ లైన్లను బాగు చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ ఆన్ ఆఫ్ లను విద్యుత్ సిబ్బంది పరిశీలించాలన్నారు. కంసాన్పల్లి నూతన బ్రేకర్ కు దాదాపు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎయ్యి ప్రదీప్ కుమార్, ఏడి ప్రదీప్ కుమార్, మరికల్ విద్యుత్ శాఖ ఏఈ వెంకటేష్ నారాయణ, రాజేందర్ గౌడ్, ఏయ్ సాయినాథ్ మల్లేష్ గౌడ్, గంగాధర్ శ్రీనివాసులు, భాను తేజ శ్రీహరి కుంబు నాథ్ రెడ్డి, విద్యుత్ శాఖ జేఎల్ఎంలు వెంకటేష్ మహబూబ్ అలీ మురళి రామకృష్ణ చిన్న నరసింహులు సిబ్బంది సురేష్ భగవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana
ధన్వాడ విద్యుత్ సబ్స్టేషన్లో కంసాన్పల్లి నూతన బ్రేకర్ ప్రారంభం నారాయణపేట జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఇ నవీన్ కుమార్....
Quick Summary:
నారాయణపేట జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఇ నవీన్ కుమార్....
