నేటి సాక్షి ఆగస్టు 06 పాములపాడు:-
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో . కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ 248 బూతు నందు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలి కచ్చితంగా కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి కి చేస్తుంది అంతేకాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి తల్లి కి వందనం ఎంత మంది పిల్లలు ఉన్నారో అంత మంది పిల్లలు కు తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అని చాల ఆనందంగా ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన కార్యక్రమం ప్రతి ఇంటి దగ్గర కు వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసిన పథకాల గురించి ప్రజలు గ్రామస్థులు చాల సంతోషంగా ఉన్నారని బీసీ సెల్ అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ గారు తెలిపారు.గురువారం వేంపెంట గ్రామ టిడిపి నాయకుడు, సొసైటీ సింగిల్ విండో చైర్మన్, జె.వి. లక్ష్మీకాంత రెడ్డి గారు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు, శ్రీ ఎల్లమ్మ దేవత దేవాలయ చైర్మన్, కంభం మోహన్ గౌడ్ గారు, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు, కంభం విక్రమ్ గౌడ్ గారు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి పథకం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ వైద్య సేవ, వంటి కార్యక్రమాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 250 బూత్ కన్వీనర్ డి చిన్న దర్గయ్య, ఏ చంద్రశేఖర్ గౌడ్, శంకరాములు నాయక్, మహమ్మద్, కరీముల్లా, బోయ కృష్ణ, వి సుబ్బయ్య, బోయ శ్రీరాములు, లక్ష్మీనారాయణ, సిద్దు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు:- కంభం మోహన్ గౌడ్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు
Quick Summary:
పాములపాడు మండలం వేంపెంట
