నేటి సాక్షి 27 జూపాడుబంగ్లా:-
ఆత్మకూరు డిపో నుండి కర్నూలు వెళ్లే ఆర్టీసీ ఎక్సప్రెస్,ఎల్లవెలుగు బస్సులు జూపాడుబంగ్లా మండలంలో ఆపడం లేదని దీనివల్ల విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే బస్సు ఆపాలని కోరుతూ విద్యార్థులు సిపిఐ జండాలతో కేజీ రోడ్డు పై ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా మద్దతుగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు, మండల కార్యదర్శి మాగబుల్ బాషా లు పాల్గొని బస్లు నిలుపుదల చేశారు..వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలకు నిలయం గా ఉన్న జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఒకపక్క అధికారులు కర్నూల్ నుండి మండల కేంద్రానికి చేరుకుంటారని, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా వేచి వేచి బస్సుల కోసం రాత్రివేళ అయినా కూడా బస్సులు ఆపక పోవడం తో విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు.బస్ పాస్ లు చెల్లెస్తున్న నిర్లక్ష్యం తగదన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏదైనా ఉంటే డిఎం తో మాట్లాడుకోండి అంటూ మాకు 59 మంది మాత్రమే ఎక్కించుకునే అర్హత ఉంది మిగతా వారిని ఎక్కించుకోలేని పరిస్థితి ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత వహించలేమని చెబుతున్నారని దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నరు. తక్షణమే సర్వీస్కు అధికంగా నడపాలన్నారు. విద్యార్థి బస్సులు నందికొట్కూరు డిపో నుండి జూపాడు బంగ్లా చుట్టుపక్కల గ్రామాలకు నడపాలన్నారు.. అనేక సార్లు ఆందోళన చేసిన నందికొట్కూరు ఆత్మకూరు డిపో మేనేజర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్లక్ష్యం చేస్తే డిపో ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
Andhra
*ఆత్మకూరు డిపో బస్ లు జూపాడు బంగ్లా లో ఆపాలని సీపీఐ జండాలతో విద్యార్థుల రాస్తారోకో*...
Quick Summary:
ఆత్మకూరు డిపో బస్ లు జూపాడు బంగ్లా లో
