నేటి సాక్షి జూలై 18 పాములపాడు:-
నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇంచార్జీ శ్రీ శివానందా రెడ్డి సార్ గారి 66 వ జన్మదినం రేపు అనగా 19 .07.2026 సందర్భంగా ముందస్తుగా ఆత్మకూరు మండలములోని కరివేన గ్రామం ఎస్సార్ బీసీ నందు గల మానవతా నిలయం( వృద్ధాశ్రమంలో) అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాములపాడు సబ్ ఇనస్పెక్టర్ శ్రీ పి. తిరుపాలు గారు పాల్గొని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ శివానందా రెడ్డి సార్ గారు నందికొట్కూరు నియోజక వర్గంలో అభివృద్ధి కోసం పాటుపడే వారని, నియోజక వర్గ ప్రజలు శ్రేయస్సు కోరుకూని నీళ్లు, కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నందికొట్కూర్ని నందనవనంగా మారుస్తున్న ఆయన మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో పార్టీ పదవులు మరిన్ని అలంకరించి ప్రజలకు సేవచేయాలని నియోజక ప్రజలు నిండుమనసుతో ఆయనను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాములపాడు మండల తెలుగుయువత అధ్యక్షుడు రుద్రవరం కరీంబాష, ఏబీఎం పాలె టీడీపీ నాయకులు కాటేపోగు నాగ సురేష్,తెలుగుయువత మండల ఉపాధ్యక్షుడు విక్రమ్ గౌడ్, మిట్టకందాల నాయకులు లింగాల శివరాముడు, లింగాల అబ్రహం, శివ రాజు,లింగాల దేవ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇంచార్జీ శ్రీ శివానందా రెడ్డి 66 వ జన్మదినం సందర్భంగా ఎస్సీ ఎస్టీ మెంబర్ నాగరాజు ఎస్ఐ తిరుపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*
Quick Summary:
ఎస్ఐ తిరుపాల్ ఆధ్వర్యంలో అన్నదాన
