నేటి సాక్షి జూలై 14
పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో సోమవారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ వెరిఫికేషన్ చేపట్టారు. తహసీల్దార్ వలిబాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు.
మరణించిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన డబుల్ ఓటర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి వివరాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి అవసరమైన సవరణలపై చర్చించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా కీలకమైందని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి సరైన సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
హనుమాపురంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ వెరిఫికేషన్
Quick Summary:
పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం