ఆర్టీసీ రెవెన్యూ పెంచే విధంగా ప్రజలు సహకరించాలి..
ధర్మపురి నియోజకవర్గంలో కొత్తగా 11రూట్లలో ఆర్టీసీ సర్వీసులు..
ధర్మపురి నుంచి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి అడ్లూరి..
ధర్మపురి:
తెలంగాణ రాష్ర్టరోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు నిచ్చారు. ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ధర్మపురి నుంచి నిర్మల్, కరీంనగర్ కు రెండు కొత్త బస్సు సర్వీసులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి బస్టాండ్ లో ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ధర్మపురి శ్రీలక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారని అన్నారు. భక్తుల సౌకర్యం కోసం నిర్మల్ నుంచి ధర్మపురి వరకు ఎక్స్ ప్రెస్ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. ఉదయం 7గంటలకు నిర్మల్ నుంచి దస్తురాబాద్, కడెం, ఖానాపూర్ మీదుగా ధర్మపురి వస్తుందని మంత్రి వివరించారు. రోజుకు రెండు ట్రిపుల చొప్పున నిర్మల్ – ధర్మపురి మధ్య బస్సు నడుస్తుందని మంత్రి అడ్లూరి తెలిపారు.
ధర్మపురి నుంచి జగిత్యాల మీదుగా ప్రయాణం కష్టంగా ఉన్న నేపధ్యంలో రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం, చొప్పదండి మీదుగా కొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. కొత్త సర్వీస్ ఉదయం 7గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరి ధర్మపురి, రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం మీదుగా కరీంనగర్ చేరకుంటుందని మంత్రి అడ్లూరి తెలిపారు. కొత్త సర్వీస్ విద్యార్ధులకు, ఉద్యోగులకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అదే విధంగా కరీంనగర్ నుంచి రాత్రి 9గంటలకు ధర్మపురికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
రాష్ర్ట రోడ్డు రవాణ సంస్ధ మంత్రి పొన్న ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ చోరవతో ధర్మపురి నియోజకవర్గంలో కొత్తగా 11 రూట్లలో నూతన బస్సు సర్వీసులు నడిపించడానికి అనుమతి తీసుకున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. నియోజకవర్గంలోని విద్యార్ధుల సౌకర్యం కోరకు నూతన బస్సు సర్వీసులు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా సహకరించాలని మంత్రి అడ్లూరి కోరారు.
జిల్లా గంధ్రాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆర్టీసీ సేవలు అందిస్తుందని అన్నారు. ధర్మపురికి వచ్చే భక్తుల కోసం నూతనంగా నడిపిస్తున్న సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని దినేష్ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, నాయకులు వేముల రాజుతో పాటు ధర్మపురి మున్సిపాల్ కౌన్సిలర్లు, జగిత్యాల డిపో మేనేజర్ రమేష్, నిర్మల్ డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ జగిత్యాల సీఐ శ్రీనివాస్, ఎఫ్ ఎం నిర్మల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
నేటి సాక్షి ధర్మపురి ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి..
Quick Summary:
ఆర్టీసీ సేవలు సద్వినియోగం
