నేటి సాక్షి జూలై 15
చిన్నారులపై జరిగే నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, సైబర్ మోసాలు, రహదారి భద్రత, ఐవీఆర్‌ఎస్ కాల్స్ తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మారుతి సూచించారు. పెద్దకడబూరు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Andhra
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Quick Summary:
చిన్నారులపై జరిగే నేరాలు,