నేటి సాక్షి 04 జూన్ జూపాడుబంగ్లా :-
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో పనిచేసే ఏఎన్ఎంలు పరిపాలన స్పష్టత లేక పలు అధికారుల ఒత్తిడి వల్ల తీవ్రంగా నలిగిపోతున్నారని హెల్త్ ఎమర్జెన్సీలో పనిచేస్తున్న ఏఎన్ఎం లను పూర్తిగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని సచివాలయం ఏఎన్ఎం లకు పిహెచ్సి ఏఎన్ఎం ల వేతనంతో సమానం చేయాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు,ఏపీ సచివాలయ ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు నాగలక్ష్మి, ఉమా, రజిని, అరుణ జోతి, జే భారతి, అరుణ లు హెచ్చరించారు..గురువారం రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జూమ్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తూ సమస్యలతో సతమతమవుతున్నారని, ఎప్పుడు ఏ అధికారి ఎక్కడ ఫోన్ చేస్తారో ఏ పని అప్పగిస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉందని,హెల్త్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సచివాలయం ఏ ఎన్ ఎం లను మెడికల్ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రజలకు ఆరోగ్య భద్రత విషయంలో ముందు ఉండాల్సిన ఏఎన్ఎంలను ఇతర పనులకు వాడుకోవడం తగదన్నారు. అధిక పని భారం తగ్గించి ఆన్లైన్ అప్లికేషన్లు తగ్గించి పని ఒత్తిడిని తగ్గించాలన్నారు. ఇతర శాఖల పనుల నుంచి మినహాయింపు ఇచ్చి మెడికల్ సంబంధిత పనులు మాత్రమే వారితో చేయించాలని వారన్నారు. ఉదయం నుండి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఏఎన్ఎంలు బయోమెట్రిక్ సౌలభ్యం కోసం ఫీల్డ్ లెవల్ లోనే నమోదు చేసే వెసలు బాటు కల్పించాలన్నారు. అన్ని రకాల అలవెన్సులు సచివాలయం ఏఎన్ఎంలకు వర్తింపచేయాలని, బదిలీలకు అవకాశం కల్పించి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రిటైర్డ్ స్థాయికి వచ్చినా కూడా పదోన్నతి చాలామందికి రాలేదన్నారు ఇది చాలా అన్యాయమన్నారు.. పై డిమాండ్ల సాధన కై ప్రభుత్వం రాష్ట్ర అధికారులు కృషి చేయాలని అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ స్పందించడం లేదని పై సమస్యలు పరిష్కరించకపోతే, మెడికల్ డిపార్ట్మెంట్లో విలీనం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం తప్పదని వారు హెచ్చరించారు.
Andhra
*సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*..
Quick Summary:
సచివాలయం ఏ ఎన్ మ్ లను పూర్తిగా
