Telangana
కొత్త పట్టాదారులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలి *ఏ ఈ ఓ కమల్ హాసన్ *
Quick Summary:
కొత్త పట్టాదారులు రైతుభరోసాకు
నేటి సాక్షి : (శ్రీకాంత్ మాడుగుల) :- బీమాదేవరపల్లి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా ( పంట పెట్టుబడి ) పథకం కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఏ ఈ ఓ కమల్ హాసన్ సూచించారు, భూ భారతి పోర్టల్ లో జూన్ 15 2026 లోపు పాసు పుస్తకాలు జారీ అయినా రైతులే అర్హులని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, బ్యాంకు పాసు పుస్తకం, జిరాక్స్ కాపీలతో స్థానిక రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఆన్ లైన్ లో నమోదు చేసుకోవలని కోరారు. వివరాలలో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు..