Telangana
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకెపాక తిరుపతయ్య మృతి -కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
-కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలంలోని సలుకునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకెపాక తిరుపతయ్య సోమవారం మృతి చెందారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్), తిరుపతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తిరుపతయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మందికి భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారా బోయిన సతీష్, ఉపసర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు.
