*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని మానస సరోవర్ ఆగ్రోసాక్స్ లిమిటెడ్ కంపెనీ నూతన అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయుసి అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ ఎన్నికైన సందర్బంగా కంపెనీ కార్మికులు ఘన సన్మానం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి నేసినల్ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి, నేష నల్ ఈబిసి అధ్యక్షులు వల్లెపురెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, సలహాదారులు కృష్ణా గౌడ్, రషీద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డేగల సతీష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చాద్ బాషా, ముక్తాన్ అలీ, అరవింద్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన గుంజా శ్రీనివాస్ మాట్లాడుతూ. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క ఐఎన్టీయుసి పెద్దలకు చిన్నలకు మహిళలకు కార్మికులకు ధన్యవాదములు తెలుపుతూ వచ్చే అక్టోబర్ నెలలో కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరిగేలా శాయశక్తుల కృషిచేసి కార్మికుల మన్ననలు పొందుతానని, ఇలాంటి గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాని తెలియజేసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులతో పాటు కార్మికులతో కలిసి సహంపక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతి, లలిత,అచ్చమ్మ, వరలక్ష్మి, లక్ష్మి, సీత్తమ్మ, కంపెనీ స్టాప్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
Telangana
ఐ.ఎన్.టీ.యు.సి రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ కు ఘన సన్మాణం
Quick Summary:
ఐ.ఎన్.టీ.యు.సి రాష్ట్ర అధ్యక్షులు
