*నేటి సాక్షి – మెట్‌పల్లి*
మెట్‌పల్లి పట్టణ 14వ వార్డులో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీజేపీ కౌన్సిలర్ దొనికెల శిరీష–నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం మెట్‌పల్లి సీఐ బి. సురేష్‌బాబు, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తులో కూడా కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
*ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం*
ఈ సందర్భంగా దొనికెల శిరీష–నవీన్ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధితో పాటు ప్రజల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధి పనులతో పాటు భద్రతా చర్యలను కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
----------
Telangana
*మెట్‌పల్లి పట్టణ 14వ వార్డు భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం* ------ * బీజేపీ కౌన్సిలర్ దొనికెల శిరీష–నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభం -------
Quick Summary:
* బీజేపీ కౌన్సిలర్ దొనికెల శిరీష–నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభం -------
