నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండల కేంద్రానికి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో మైలురాయి పోషించిన యోధులు జన్మించిన చరిత్ర కలదు. అలాంటి చరిత్ర ఉన్న చిలుకూరులో ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం లేకపోగా రహదారిపై నిలుచోటానికి కూడా అడుగు స్థలం లేదు. ఇదిలా ఉంటే జాతీయ రహదారి స్థలాన్ని ఆక్రమణ చేయడంతో పాటు, పదిమందికి విద్యను అందించే పాఠశాల భవనాన్ని ఆసరా చేసుకొని రేకుల దుకాణాలను ఏర్పాటు చేసి జాతీయ రహదారి మొత్తాన్ని మూసి వేశారు. ఈ ప్రాంతంలో రోడ్డు దాటాలన్న, భారీ వాహనాలు, చిన్న చిన్న వాహనాలు సైతం యూటర్న్ తీసుకోవాలంటే అదొక నరకప్రాయమే. ఇన్ని సమస్యలు ఈ ప్రధాన కేంద్రంలో ఉన్న అటు జాతీయ రహదారి వారికి కానీ, గ్రామపంచాయతీ అధికారులకు కానీ, పాఠశాల నిర్వహించే ఉపాధ్యాయులకు కూడా మాకు ఎందుకులే అన్న చందాన మిన్నకుంటున్నారు. దుకాణ యజమానులు పాఠశాల భవన కిటికీలను మూసివేయడంతో పాటు, భవనానికే దుకాణానికి సంబంధించిన రేకులు వేసేందుకు పైపులు అమర్చుకున్నారు. ఈ విషయంలోనూ విద్యాశాఖ మండల అధికారి గాని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఏ మాత్రం మాట్లాడకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ దుకాణాల అద్దెల విషయంలోనూ గ్రామంలో గుసగుసలాడుతున్నారు. దుకాణాల సముదాయాలను తొలగించడంతోపాటు, ప్రయాణికులు వేచి ఉండేందుకు ఈ రహదారికి ఇరువైపులా. బస్ షెల్టర్ లు. ఏర్పాటు చేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి ఆక్రమణ విషయంలో జాతీయ రహదారి అధికారులను మాకు సంబంధం లేదు మీ గ్రామపంచాయతీ వాళ్ళే చూసుకుంటారని, గ్రామపంచాయతీ వారిని అడిగితే అది జాతీయ రహదారి పరిధిలోకి వస్తుందని, సంబంధిత అధికారులే చర్యలు తీసుకుంటారని మాటలతో దాట వేస్తున్నారు.
Telangana
**వాహనాన్ని నిలుపలేము... బస్సు సేవలు వినియోగించుకోలేం*
Quick Summary:
వాహనాన్ని నిలుపలేము..... బస్సు సేవలు వినియోగించుకోలేం....

