*నేటి సాక్షి రాజేంద్రనగర్* జూలై:2
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ వీసా మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారంతా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు.*ఉపాధి ఆశ చూపి మోసం* పోలీసుల విచారణలో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశాడని మహిళలు వాపోయారు. తమకు ఎలాంటి తప్పు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
*ఏజెంట్ కోసం పోలీసుల వేట* ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సదరు మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏజెంట్ పూర్తి వివరాలు, మోసానికి పాల్పడిన విధానంపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Telangana
*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ వీసా మోసం 20 మంది మహిళలు అరెస్ట్* *నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నం* *ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడని బాధితుల ఆవేదన*
Quick Summary:
నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నం
