నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామంలో ప్రకృతి సిద్ధమైన వాతావరణ పరిస్థితులు మెరుగుపడి వర్షాలు సమృద్ధిగా కురవాలనే లక్ష్యంతో, ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలో 3000 మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటివరకు 800 మొక్కలు నాటినట్లుగా వారు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి సిద్ధమైన వాతావరణం కలిగేలా చూడాలని సర్పంచ్ లా వూరి రమాదేవి శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శౌరిక ఉప సర్పంచ్ సురేష్ పాలకవర్గ సభ్యులు. అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*దూతియా తండాలో వన మహోత్సవం*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం