Telangana
*అంగన్వాడీ పోస్టుల భర్తీ పై గిరిజనల ఆందోళన *
Quick Summary:
అంగన్వాడీ పోస్టుల భర్తీ పై
నేటి సాక్షి : (శ్రీకాంత్ మాడుగుల ):- భీమాదేవరపల్లి మండలం వీరబాధ్రనగర్ గ్రామం పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి తండా అంగన్ వాడి టీచర్ పోస్ట్ భర్తీ వివాదాస్పదంగా మారింది... దాదాపు ఎనిమిదేళ్ళగా ఖాళీగా ఉన్న పోస్టును స్థానిక అర్హులైన మహిళలకు కేటాయించకుండా, సమీపంలోని మంక్త్యా నాయక్ తండాకు చెందిన అంగన్వాడీ ఆయా భానోతు కమలను టీచరగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గిరిజనులు గ్రామపంచాయితీ కార్యాలయం, అంగన్ వాడి కేంద్రం ఎదుట ఆందోళన చెపట్టారు గ్రామస్థుల కథనం ప్రకారం, పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటి నుండి తామ తండాకు చెందిన పలువురు నిరుద్యోగా మహిళలు ఉద్యోగం కోసం ఎదురుచూశారు.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం అర్హులైన స్థానిక మహిళలు దరఖాస్తులు కూడా సమర్పించారు.. అయితే చివరికి స్థానిక అభ్యర్థులను పక్కన పెట్టి ఇతర తండాకు చెందిన వ్యక్తిని నియమించటం అన్యాయమని వారు అరోపించారు..... ఎనిమిదేళ్లగా ఖాళీగా ఉన్న పోస్టును ఇప్పుడు ఎందుకు భర్తీ చేశారు.? స్థానిక దరఖాస్తులను ఎందుకు పరిగణంలోకి తీసుకోలేదు.? మా తండా కు చెందిన పోస్టును ఇతర తండాకు ఎలా కేటాయించారు.?" అంటూ గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. నియమాక ప్రక్రియలో పారదర్శికత పాటించలేదని ఆరోపిస్తూ, పూర్తి వివరాలను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు.