* నేటి సాక్షి ధర్మపురి ధర్మపురిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*
*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్*
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జెండా ఆవిష్కరణకు ముందు ఆయన డా. బి.ఆర్. అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్కులను పంపిణీ చేశారు.
"దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి బాటలో నేటి యువత నడవాలని" ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్*
Quick Summary:
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో

