*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామ పరిధిలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నేషనల్ డెవర్మింగ్ డే పురస్కరించుకుని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ కాసారపు భవాని అరవింద్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సంరక్షణలో నులిపురుగుల నిర్మూలన అత్యంత కీలకమని పేర్కొన్నారు. నులిపురుగులు చేరడం వల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఏర్పడి శారీరక మానసిక ఎదుగుదల దెబ్బతింటుందని కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ మాత్రలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎం బుజ్జవ్వ మాట్లాడుతూ1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ ఈ మాత్రలు ఎంతో సురక్షితమైనవని, వీటి ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ అంగన్‌వాడీ టీచర్ మడ్డి జలజ,రమాదేవి,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
ఘనంగా జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం
Quick Summary:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం