నేటి సాక్షి జూలై 13 జూపాడుబంగ్లా :-
సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్రసవరణ ప్రక్రియలో అర్హులైన ఓట్ల గల్లంతు పారాలను నింపడంలో ఇబ్బందులు వల్ల అలసత్వం మరియు రాజకీయ ప్రమేయం వంటి ప్రధాన సమస్యలు వెలుగుచూస్తున్నాయని,ఈనెల 14వ తేదకి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించడం వల్ల చాలా మంది గందరగోళం లో ఉన్నారని,గడువు ముగింపు పూర్తి కావస్తున్నప్పటికీ చాలామంది ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
కానీ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దానికి గండి కొడుతుందని,మరణించిన ఓటర్ల పేర్లను శాశ్వతంగా వలస పోయిన వారిని నకిలీ ఓట్లను తొలగించడం ఎస్ఐఆర్ ఉద్దేశమని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుందన్నారు.. ఇప్పటివరకు చాలాచోట్ల 50 శాతం కూడా ఓటర్ల ఎనిమరేషన్ ప్రక్రియ పూర్తికాలేదు సరైన సమాచారం అందకపోవడం సాంకేతిక లోపాల వల్ల చాలామంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందని,ఎనిమరేషన్ ఫారాలను నింపడంలో ప్రజలకు అవగాహన లోపించడం క్షేత్రస్థాయి ఉన్న నిబంధనలు అర్థం కాకపోవడం వల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు.చాలా ప్రాంతాల్లో బిఎల్వోలు ఇళ్లకు వెళ్లి సర్ పత్రాలు ఇవ్వకపోవడం సమయానికి నమోదు ప్రక్రియ పూర్తి చేయకపోవడం వంటి నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు.అంతేకాకుండా విపక్షాల ఓట్లను తొలగించడానికి ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయని. కావునా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మరో మూడు నెలలు ఎస్ఐఆర్ ను పెంచాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మక్బూల్ బాషా నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Andhra
ఓటర్ల సర్వే గడువును మరో మూడు నెలలు పొడగించాలి.. సీపీఐ... *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు*..
Quick Summary:
సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడారు.