*నేటిసాక్షి* జూన్ 2
తిరుమలాయపాలెం (రుద్రరాజు)
తిరుమలాయపాలెం మండలం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడం, అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో అమలు చేస్తున్న కప్పాస్ కాంతి పథకం కింద తిరుమలాయపాలెం మండల రైతు వేదికలో రైతులకు 100 శాతం సబ్సిడీపై అధిక ఉత్పాదక పత్తి విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో పత్తి సాగు చేపట్టాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించి, సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు.
పథకం ద్వారా అర్హులైన రైతులకు పూర్తిగా ఉచితంగా పత్తి విత్తనాలను అందిస్తున్నామని, రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంట నిర్వహణ చేపట్టాలని కోరారు. రైతులు పంటలో సమతుల్య ఎరువుల వినియోగం, సమయానికి కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతు వేదిక సభ్యులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారాం రెడ్డి, మేడిద పల్లి గ్రామ సర్పంచ్ మోర అనిల్ రెడ్డి, తిరుమలాయపాలెం సర్పంచ్ ధరావత్ సుజాత నరసింహారావు, మండల ఏఈవోలు, రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు
Telangana
*కప్పాస్ కాంతి పథకం ద్వారా 100% సబ్సిడీపై అధిక దిగుబడి పత్తి విత్తనాల పంపిణీ* మండల వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి
Quick Summary:
మండల వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి
