*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
నియోజకవర్గం
కుత్బుల్లాపూర్ రోడామేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని ఉమాదేవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఓటరు సవరణ (సర్) కార్యక్రమంలో బాధ్యతాయుతంగా పాల్గొంటూ అధికారులకు సహకారం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పేరవేన సమ్మయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి కరుణాకర్ రాజు మాట్లాడుతూ, సర్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి తమ కాలనీలో బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు దరఖాస్తులను నింపించడంతో పాటు అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. అలాగే బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు తమ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని, వారితో కలిసి బస్తీలో పర్యటిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య బలోపేతమే లక్ష్యంగా ప్రతిరోజూ సర్ కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకుని, ఓటరు వివరాలను సరిచేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి శెర్విరాల కృష్ణమూర్తి గుప్తా, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఉమాదేవినగర్ లో సర్ పై సహకారం అందిస్తున్న కమిటీ సభ్యులు*
Quick Summary:
కుత్బుల్లాపూర్ రోడామేస్త్రి నగర్ డివిజన్