Telangana
*విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం* • *లక్ష్యాన్ని మించి పోలియో డోసుల పంపిణీ* • *102 శాతం పల్స్ పోలియో లక్ష్య సాధన* - *వైద్యాధికారి డాక్టర్ సుస్మిత*
Quick Summary:
విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం
నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ యు. సుస్మిత తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 24 పల్స్ పోలియో బూతులు, 17 సబ్ బూతులు, రెండు ట్రాన్సిట్ కేంద్రాలు, ఒక మొబైల్ బృందం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని పేర్కొన్నారు. మండలంలో 2,815 మంది చిన్నారులకు డోసులు వేయాలనే లక్ష్యానికి గాను 2,881 మందికి పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. ధర్మారం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా 238 మంది చిన్నారులకు డోసులు అందించామని పేర్కొన్నారు. కటికనపల్లి పరిధిలోని రాజరాజేశ్వర సిమెంట్ బ్రిక్స్ హైరిస్క్ ప్రాంతంలో మొబైల్ బృందం ద్వారా ఐదుగురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి మొత్తం 3,004 మంది పిల్లలకు పోలియో డోసులు అందించి 102 శాతం లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన 123 మంది పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.
