*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గాయత్రి బ్యాంకు గొల్లపల్లి శాఖ యొక్క ఖాతాదారులైన రెడపాక లచ్చవ్వ ప్రమాదవశాత్తు మరణించగా మృతుడికి ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యందు గల గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై గల.ప్రమాదభీమా సౌకర్యం ద్వారా ఆమె కొడుకు అయిన రెడపాక రాజేందర్ 2 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును గొల్లపల్లి తహసీల్దార్ మహమ్మద్ అబ్దుల్ మాజీద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ నేరెళ్ళ మునీందర్ మరియు జూనియర్ ఆఫీసర్స్ బిల్లకూరి విజయ్ కుమార్ ముండ్ల చంద్రశేఖర్ క్లర్క్ చెనివేని మహేష్ పాల్గోన్నారు.అలాగే రైతులకు 10.50% పెర్.అనుమ్ చొప్పున వ్యవసాయ రుణాలను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.గొల్లపల్లి పరిసర గ్రామాలలో బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించడం ద్వారా పెన్షనర్లు మరియు ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు.అనంతరం బ్రాంచి మేనేజర్ నేరెళ్ళ మునీందర్ మాట్లాడుతూ వినియోగదారులకు 24గంటలు ఎటిఎం లలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా గొల్లపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను
తీరుస్తున్నామని అలాగే తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా రూ18,600/- తో ఋణాలను అందిస్తున్నాము.మరియు సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో మరియు జిరాక్స్లను.బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని,వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధికై ఋణాలను అందిస్తున్నామని అలాగే కిసాన్ వికాస్ పత్రాలు మరియు పోస్టుఆఫిస్ డిపాజిట్లపై కూడ కేవలం 0.83 పైసలకే అనగా 10% పా రేటుకి ఋణాసౌకర్యం అందిస్తున్నామని వినియోగదారులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవలసింది గా కోరారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ మాజీద్ బ్యాంక్ మేనేజర్ నేరెళ్ల మునింధర్.బి విజయ్, యం చంద్రశేఖర్ జూనియర్ ఆఫీసర్స్ సిహెచ్ మహేష్ క్లార్క్ పాల్గొన్నారు
Telangana
గాయత్రి బ్యాంక్‌లో రూ.2 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్ మంజూరు అందజేసిన ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ మాజీద్
Quick Summary:
అందజేసిన ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ మాజీద్