మిర్యాలగూడ, జూలై 20: మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజనల్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 14 వినతులు అందాయని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ అధికారి రమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖల వారీగా అందిన వినతులు:
రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, మిర్యాలగూడ–2, తహశీల్దార్ కార్యాలయం, మిర్యాలగూడ–7,
తహశీల్దార్ కార్యాలయం, మాడుగులపల్లి–1,
తహశీల్దార్ కార్యాలయం, త్రిపురారం–1,
మున్సిపాలిటీ, మిర్యాలగూడ–2,
జిల్లా స్థాయి పంచాయతీ అధికారి కార్యాలయం, మిర్యాలగూడ–1 అందినట్లు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి బాధితులకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు.
Telangana
మిర్యాలగూడ డివిజన్ స్థాయిలో...ప్రజావాణికి 14 వినతులు -సమగ్ర విచారణ జరిపి, వెంటనే పరిష్కారం చేయాలి -ఆర్డీఓ రమణారెడ్డి
Quick Summary:
-సమగ్ర విచారణ జరిపి, వెంటనే పరిష్కారం చేయాలి