*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కుతోందని మహిళా కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి విమర్శించారు. శుక్రవారం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజనోళ్ల లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో మహిళల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహిళా నాయకులు ప్రజా సమస్యలపై గళమెత్తినప్పుడు వారిపై కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల సాధికారతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మీనాక్షి నటరాజన్‌పై జరుగుతున్న చర్యలను మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసారు.
Telangana
*మీనాక్షి నటరాజన్‌కు మహిళా కాంగ్రెస్ మద్దతు*
Quick Summary:
నటరాజ్ కు మహిళా కాంగ్రెస్ మద్దతు.....