నేటి సాక్షి, శంకర్ పల్లి; జూన్ 04.( సుధాకర్ గౌడ్)
ఈసారి వర్షాకాలంలో పెను మార్పులు ఉండటం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని, రైతులు పంటలు పండించడం లో మెలకువలు పాటించాలని చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి అన్నారు. గురువారం శంకర్ పల్లి మండలం పరివేద గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 ప్రణాళికలో భాగంగా గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డిఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాతావరణం లో ఈసారి పెను మార్పులు జరుగుతున్నాయని ఎల్ నీ నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని చెప్పారు. అందుకోసం రైతులు ఏ పంటలు వేయాలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఓటర్ల జాబితాను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాలలో పారిశుధ్యం పట్ల గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్, స్థానిక తహసిల్దార్ సురేందర్, మాజీ ఎంపిటిసి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి,రైతులు పాల్గొన్నారు.
Telangana
ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి..
Quick Summary:
ఎల్ నీ నో ప్రభావం, పంటలు పడించటం లో జాగ్రత్త..